Monday 26 March 2012

Change Your Fb Background Theme: Feel The Difference and The PrivilegeSte...

Change Your Fb Background Theme:







Feel The Difference and The Privilege

Ste...
: Feel The Difference and The Privilege Step 1: Click Share  Step 2: Click All Likes 3: Copy Below Message & Po...

Sunday 18 March 2012

సంకీర్తనలు


  1. సంకీర్తనలు 

  1. సంకీర్తన
  2. సంకీర్తన 

Tuesday 13 March 2012

టెర్రరిస్టుల దాడుల్ని కనుగొనే టవర్

                                             టెర్రరిస్టుల దాడుల్ని కనుగొనే టవర్ 
                                                  
వరల్డ్  ట్రేడ్  సెంటర్ లపై  దాడులు జరిగినప్పటి నుంచి ప్రభుత్వం ఇలాంటి దాడులను అరికట్టే అందుకు పలు చర్యలు తీసుకుంటుంది . ఇందులో భాగంగానే  టెర్రరిస్ట్ లు జరిపే జీవ రసాయన దాడులను పసికట్టే అందుకు వాషింగ్టన్ లోని నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ భవనం పై ఒక టవర్ని ప్రారంబించింది . ఈ టవర్ వాషింగ్టన్ నగరం పై నుండి వీచే గాలిలో రేడియేషన్ జీవరసాయన ఆయుధాలను పసికట్టి వాటి ప్రమాదాన్ని తెలియజేస్త్యుంది .

జపనీస్ సవ్యసాచులు


                                               జపనీస్  సవ్యసాచులు 

   సాదారణంగా మనదేశంలోనే కాదు అన్నిదేశాల్లో  విద్యార్దులు కుడి చేతితోనే లేదా ఎడం చేయి ఉపయోగించి రాస్తారు. కాని జపాన్ దేశం లో మాత్రం కుడి ఎడమ రెండు చేతులతో రాయడం నేర్పుతారు. ఇది మన అర్జునుని సవ్యసాచి లక్షణాన్ని వ్యక్త పరుస్తుంది.

రోబోట్ అర్ధం


  •                                                             రోబోట్  అర్ధం 


 
    మర మనిషికి  ఆంగ్లేయ పదం ' రోబోట్ ' జెక్ భాష లోరాబోట అనే పదం నుంచి ఏర్పడింది .రాబోట అంటే 'వెట్టి చాకిరి ' అనే అర్ధం లో కారెల్ కీసెక్ 1923  '  సంవత్సరం లో తను రచించిన నాటకం లో ఈ పదాన్ని ఉపయోగించాడు .మర మనుషులు ఈ నాటకం లో మనుషుల ను  చంపుతారు. ఇప్పుడు ఈ పదం ప్రపంచ వ్యాప్తం గా తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు .ఎవరి దగ్గరైనా సృజన ఉంటే అది ప్రపంచాన్ని చుట్టి వచ్చే రోజు ఒకటి ఉంటుందనేది తప్పక నమ్మవలసిన సత్యం . 

  •                                                                   బ్రెయిన్ తుపాకి 


            అమెరికా దేశపు కొత్త బ్రెయిన్ తుపాకి కి అమర్చిన రాడారు గంటకి 900 మైళ్ళ వేగంతో వెళ్ళే విమాన మార్గాన్ని   అనుసరిస్తుంది. 15  మైళ్ళ విస్తృత వైశాల్యం వరకు దీని ప్రభావం వుంటుంది. పగలు రాత్రి కూడా పని చేసే ఈ సాధనానికి వెరే  సిబ్బంది   అక్కర లేకుండా నిమిషానికి 215  గుళ్ళను పేలుస్తుంది .
                                                                

Monday 12 March 2012

ఆమ్ల వర్షాలు

                                                   ఆమ్ల వర్షాలు 

          ఆమ్ల వర్షాలు ఇప్పుడు భారతదేశంలోనూ  స్వల్పంగా పడుతున్నాయి .వీటి వల్ల ఏర్పడే సల్ఫర్ డై ఆక్శైడ్ , ఇతర రసాయినిక పదార్ధాలు ,పెద్ద ,పెద్ద నిర్మాణాలకు , స్మృతి చిహ్నాలకు హాని కలిగించగలవు .తాజమహల్ ,ఎర్రకోట , కుతుబ్మీనార్,కోణార్క్ ,దేవాలయాల పై ఆమ్ల  వర్షాల ప్రభావం చూపిస్తాయి . ఈ  వర్ష ప్రభావాల నుంచి ప్రకృతిని , మన సంస్కృతి వారసత్వ సంపదని కాపాడుకోవలసిన అవసరం  యువత పై  ఎంతో ఉందనే విషయం  ఇప్పటి నుంచే గ్రహిస్తే బాగుంటుంది . ఆ దిశ లో యువ శాస్త్ర   వేతలు  కృషి కొన సాగితే రాబోయే తరాలకు అది వరంగా పరిడవిల్లుతుంది.  
                                           
                                               అంకెల నిగంటువు 
             న్యూ డిల్లీ లో యూనివర్స్ డిజిటల్ కమ్యునికేషన్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూ షన్  వారు తయారు చేసిన అంకెల నిఘంటువు సంప్రదాయకమైన లిపి లేకుండా సున్నా నుండి  తొమ్మిదివరకు గల అంకెలను దీని లో ఉపయోగించడం  జరిగింది .వీడియో టర్మినల్ మీద కీబోర్డు లో కొన్ని అంకెలను పంచ్ చేస్తే  హిందీ , సంస్కృతం , ఇంగ్లీష్ వాక్యాలు అచ్చై ఉంటాయి ..  

Monday 5 March 2012

వింతలు - విశేషాలు

                                                             వింతలు - విశేషాలు 

. మనదేశంలో చదువుకున్న వారికే ఉద్యోగం లేక నానా అవస్తలు పడుతున్నారు . కాని బ్రిటన్ లో చింపాంజీలకు, కోతులకు కూడా ఉద్యోగాలున్నాయి . లండన్ నగరం లో పెయింట్ బాయిస్ కంపెనీ లో ఒక చింపాంజీ స్వీపర్ ఉద్యోగాన్ని సంపాదించింది . మన కరెన్సీ లో  దాని నెల జీతం  సుమారు మూడువేల పయిన  వుండటం విశేషం .


౨. అమెరికా దేశపు కొత్త బ్రెయిన్ తుపాకీ కి అమర్చిన రాడారు గంటకి తొమ్మిది వందల ( 900 ) మైళ్ళ వేగంతో వెళ్ళే విమాన మార్గాన్ని అనుసరిస్తుంది . 15  మైళ్ళ విస్తృత వైశాల్యం  వరకు  దీని ప్రభావం వుంటుంది . పగలు , రాత్రి  కూడా పని చేసే ఈ సాధనానికి వేరే సిబ్భంది అక్కర లేకుండా నిమిషానికి 45  గుళ్ళను పేలుస్తుంది .