Sunday 23 June 2013

బాసిజం (కవిత )

                                            బాసిజం (కవిత )

                                                                  భద్రం కొడకో నీ కొలువు 

అతని  పేరు బాస్ 
తను ముట్టుకుంటే 
నువ్వు పాదరసంలా పరిగెత్తాలి 
కొలిమిలో ఇనుములా కాలాలి 
ఎటువంచాలనుకుంటే అటువంగాలి 
శునకంలా విశ్వాసాన్ని ప్రకటించాలి 
ఎంత బరువుపెట్టినా ఓండ్ర పెట్టని గాడిదవ్వాలి 
తను తోక్కా లనుకున్నప్పుడు 
నువ్వు అడుస్సవ్వాలి 
మలచాలనుకుంటే  నువ్వు ఘటం కావాలి 
ఆత్మాభిమానం ఆత్మగౌరవం 
అనే వ్యర్ధపదాలకు అర్ధాలు వెతక్కు 
అది చాకచక్యం లేని చేతగానితనం 
ఇక్కడ బతకాలంటే లౌక్యం కావాలి 
నీ పై నీవే యుద్ధం ప్రకటించుకోవాలి  
బ్రతుకు కురుక్షేత్రంలో ఎవరిపైనైనా  
యుద్ధానికి సిద్ధం కావాలి 
ముఖం పై ఉమ్మినా ....... 
చలించని స్తిత ప్రజ్జ్టత కావాలి 
దేహానికి తొడుగుల్లాగే ... 
అడుగులకు మడుగులొత్తడం తెలియాలి 
అందరి తలలో నాలుకవ్వాలి 
తను చెప్పే ప్రతిపదాన్ని గీతగా  భావించాలి 
పొసగని పదజాలం వాడకు 
ఆ పదాలను ఏరుకెల్లే జాగిలాలుంటాయి 
నీ వెనకె.......... 
ఒక  మెట్టు ఎక్కడానికి
 మెట్లవైపు చూసేలోపే 
నిన్ను తొక్కెయ్ డానికి 
నీ పక్కని కళ్ళే కాపలా కాస్తాయి 
నీకు శిలువు పది మేకు దిగేలోపే 
నీ చుట్టూ ఉన్న ముఖాలు  వేలవేసి 
పేలవంగా చూస్తాయి 
ఏమీ ఎరగనట్టు 
భద్రం కొడకో నీ కొలువు 
బహు హుషారుగాళ్ళు న్నారు 
                          

                                                                    -  సత్యం 














No comments:

Post a Comment