Sunday 23 June 2013

ఐ లైక్ గల్స్ బట్ ఓన్లీ టెన్ మినిట్స్

   

        నేను  ఈ రోజు ఒక మోటార్ బైక్ మీద  ఒక విషయాన్ని చదివాను . అది  "ఐ లైక్ గల్స్ బట్ ఓన్లీ  టెన్ మినిట్స్ "అని  ఉంది . అది  మొదటిగా  చూసి చదివినప్పుడు కొంచెం వింతగా అనిపించింది . మరికొంచెంసేపు ఆగి ఆలోచిస్తే ఎందుకలా అనే సందేహం కలిగింది . మళ్ళీ వెంటనే తేరుకొని He does  want girls  only for  sex need అని అర్ధమైంది . అంటే స్త్ర్రీలు అందుకు  తప్ప దేనికీ పనికిరారనే ఒక నిశ్చిత అభిప్రాయానికి అతను వచ్చాడు . లేదా స్త్రీలపై  అపనమ్మకాన్నైనా పెంచుకొనిఉండాలి . ఇంకొంచెం  లోతు గా  పోతే ఆడవాళ్ళ ప్రేమ మీద అతనికి నమ్మకం  లేదు అని చెప్పుకోవాలి .  ఈ  నమ్మకం లేని తనాన్ని అతను పెంచుకోవడానికి ఏదైనా బలమైన కారణ0 ఉండాలి . సరే కారణం  మనకు తెలిసే అవకాసం లేదు . కాబట్టి అసలు ఇలాంటి ప్రేరణ నేటి తరంలో ఎందుకు కలుగుతుందో విజ్ఞత కలిగిన కొందరై నా ఈ టాపిక్ గురించి విశ్లేషిస్తే బాగుంటుందనిపించింది . ఆ ప్రయత్నం లో భాగమే ఈ  వ్యాసం . 
    
    ' స్త్రీ' ని  ఆదిశక్తి గా పూజించమని మన సనాతన ధర్మం బోధిస్తుంది . ''ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు ''అనే   ఆర్యోక్తి  వినిపిస్తుంది . మనం  ప్రయాణించే బస్సు లో కూడా''స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం ''  అని  రాసుంటుంది . మన పుట్టుకలోనే  అమ్మతనాన్ని తెలిపే  స్త్రీ మూర్తి కనిపిస్తుంది . మన అనుబంధాలలో  అక్క ,  చెల్లి వంటి  ఎన్నో మమకారాలతో కూడిన బంధాలున్నాయి . ఈ బంధాలన్నీ స్త్రీల పట్ల  చెడ్డ ఆలోచనలు వచినప్పుడు , ఎందుకు గుర్తుకురావో అర్ధంకాదు . ఒక  వేళ అర్ధమైనా!  ఆ వ్యామోహంలో ఆలోచించే శక్తిని కోల్పోతున్నాడా ?అనేది ఆలోచించాలి .  
      ఈ మధ్య  సెక్స్ కి  సంబందించిన  ఒక వ్యాస0  చదివాను .  ఆ వ్యాసంలో  నేటి తరం  ఆహారపు  అలవాట్ల  ప్రభావం వలన కౌమార దశలో ఉన్న పిల్లలను హార్మోన్స్  నిలవనివ్వడం లేదని రాసారు . ఇది శాస్త్రపరంగా  ఎంతవరకు నిజమో మనం చెప్పుకోవలసిన పని లేదు . అలాగే నేటి సినిమాల ప్రభావం కూడా అంతే ఉంది . సినీ గీత సాహిత్యంలో కూడా  కౌమార దశలో ఉన్న పిల్లల్ని భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉంది . ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలకు అంతుండదు . ఇలాంటి  పది  నిమిషాల కోరికలు  మనవాళ్ళ కేనా  అంతకుముందు ఎవరికైనా ఉన్నాయా? అని  ఆలోచిస్తే  మన పురాణాలలో చాలామంది కనిపిస్తారు. 
              సాక్షాత్తు విష్ణుదేవుడు జలన్ధరుడి భార్యను రమించాడు  . మోహిని అందాన్ని చూసి తట్టుకోలేక శివుడు ఆత్రాపడ్డాడు . బ్ర్హహ్మా దేవుడు తను సృష్టంచిన సరస్వతినే ఇష్టపడ్డాడు .    దేవేంద్రుడైన  ఇంద్రుడు  అహల్యను పదినిమిషాల కోసమే కామించాడు . పరాశరుడు మత్యకన్యను చూసి ఆపుకోలేక మహాభారతాన్ని చేశాడు . విశ్వామిత్రుడు ఇంద్రుడి ఉచ్చులోపడి మేనక అందాలను పొందడానికి  తపోభంగానికైనా ఇష్టపడ్డాడు .  వ్యాసుడు ఘ్రుతాచిని మోహించాడు . వాలి  తమ్ముడైన సుగ్రీవుని భార్యను అపహరించాడు . రావణుడు సీతమ్మ తల్లి సౌందర్యానికి  తట్టుకోలేక గంగవెర్రులెత్తాడు .  ఇవన్నీ తెలుసుకున్న వేమన " ఆడుదాని చూడ అర్ధంబు చూడ బ్రహ్మ కైన పుట్టు రిమ్మ తెగులు " అన్నాడు . 
ఈకథల్లో మనం గమనించాలిసినవి రెండున్నాయి . 
              1. మహనీయులు  చేసిన ఆ కార్యాలు  లోక కల్యానార్ధం . 
              2. లోకకంటకులు  చేసిన  పాపాలు  వారి వినాసనార్ధమ్ . 

     ఇది గమనిస్తే  కొందరు    చేసేపనులు లోకకంట కాలనే విషయం స్పష్ట మౌతుంది .       
   ఈ విధగా చెప్తే  కొతమంది కొంటె కుర్రాళ్ళు   మేముకూడా లోక కళ్యాణం కోసమే అని ఎందుకు అనుకోరు ?అన్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు . 
     అసలు నేటితరం సెక్స్ అనే క్రియకు మాత్రమే ఎక్కువ  విలువ ఇస్తున్నారు . ప్రేమకు,
దాని తాలూకు, మనసుకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం   వెనక అనేకమైన చేదు విషయాలున్నాయి . 
                                    ఆ విషయాల చర్చకు ఆహ్వానం                                          ( ఇంకావుంది  )(''చదవేస్తే ఉన్న తెలివి
 సాంతంగా నశించింది 
  ఈ  నాటి కామ వాంఛ 
  నానాటికి చెలరేగుతుంది 
  మన బాబుల వ్యవహారం 
  ఎవడు చెల్లించుతాడు 
  ఈ  తప్పుడు పరిహారం "   ?????????????????????????????????????????????????????















No comments:

Post a Comment