నీ చూపు చాలు (కవిత )
ఎన్ని వసంతాలు కలిస్తే మాత్రం
ప్రకృతికి నీ అంత అందమొస్తుంది
పూల పుప్పొడుల్ని చేర్చి
తేనెతో రంగరించి పోత పోస్తే
నీ సోయగాల శిల్పం ఔతుంది
ఎన్ని గులాబి రేకుల్ని నీ అందాల
తొడిమకు వరసగా పొదిగితే
నీ మేని ఛాయ వస్తుంది
ఎలా చూసినా నీ అంత
అందాన్ని సృష్టించడం
బ్రహ్మకైనా సాద్యం కాదు
నీ దాగని సొగసుల దోబూచులు
వలపు పల్లవుల్ని ఆలపిస్తుంటే
నా హృదయం నీ పల్లవికి
చరణం కావాలని పరితపిస్తుంది
అందుకే చెలి
నీ సుతి మెత్తని ఓర చూపు
తామర తూడు లాంటి నీ చేతి స్పర్శ
కన్నా 'ఐ' స్కాంత బలం కలది
అందుకే
నీ చూపు నా వైపు సారిస్తే చాలు
నా నరాలలో ఎన్నో నదులు
వెల్లువై పొంగుతాయి
అంతులేని ఆనం(అం)దపు
సముద్రాల్ని చిలికేలా
నువ్వు అందించే ఒక్క నవ్వు చాలు
మైకంలా కమ్ముకున్న మృత్యువు
క్షణంలో దూరం కావడానికి ,......
- సత్యం
No comments:
Post a Comment